Abhishek Bachchan: ప్రభాస్ సినిమాలో అభిషేక్ బచ్చన్?
- ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న 'ఫౌజీ'
- ఈ చిత్రంలో అభిషేక్ ఎంట్రీపై హిందీ మీడియాలో వార్తలు
- కల్కి 2898 ఎ.డిలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న అమితాబ్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ త్వరలో తెలుగు తెరపై కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. యువ సంచలన నటుడు ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటించనున్నారని హిందీ సినీ పరిశ్రమలో ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రభాస్ కథానాయకుడిగా, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఓ ప్రధాన పాత్ర కోసం అభిషేక్ బచ్చన్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఆయన కూడా వెంటనే అంగీకరించారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, అభిషేక్ బచ్చన్ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఆయన తండ్రి అమితాబ్ బచ్చన్ తెలుగు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్‌తో కలిసి ‘కల్కి 2898 ఎ.డి’లో నటించిన ఆయన పాత్ర ప్రత్యేకంగా నిలిచింది.
ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌ల మధ్య ఉన్న సత్సంబంధం వల్లే ఈ ప్రాజెక్ట్‌కు అభిషేక్ చేరిక సులభమై ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంలో ఆయన నటిస్తే, అభిషేక్ బచ్చన్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కానుంది.