నేడు తాడేపల్లికి వైఎస్ జగన్ .. సాయంత్రం ముఖ్య నేతలతో భేటీ!
- ఈ రోజు ఉదయం 11.15 గంటలకు గన్నవరం చేరుకోనున్న జగన్
- రోడ్డు మార్గంలో బయలుదేరి 12.40 గంటలకు తాడేపల్లి నివాసానికి
- ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ సభ్యులతో సమావేశం
అనంతరం, అందుబాటులో ఉన్న వైసీపీ ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశమవుతారు, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించడంతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శాసనమండలిలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపైనా సూచనలు సలహాలు అందించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.