నేను పదవుల కోసం పాకులాడలేదు: గువ్వల బాలరాజుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు
- పదవులు ఇవ్వలేదని అలిగేవాడు కార్యకర్త కాదన్న ప్రవీణ్ కుమార్
- పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ పదవి ఇస్తానని రేవంత్ చెప్పారని వెల్లడి
- అధికారం లేకపోయినా కేసీఆర్ వెంట నడుస్తానని వ్యాఖ్య
- ఎంపీ కావాలని బీఆర్ఎస్ లో చేరలేదన్న ప్రవీణ్ కుమార్
- సర్వీసులో ఉంటే డీజీపీ హోదా వచ్చేదని వ్యాఖ్య
తాను బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ కూడా అడగలేదని... ఆ విషయం గువ్వల బాలరాజుకు కూడా తెలుసని చెప్పారు. తనకు కాదని నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ప్రవీణ్ కుమార్ కు ఇచ్చారని బాలరాజు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారని... ఎంపీ కావాలని తాను బీఆర్ఎస్ లోకి రాలేదని చెప్పారు.
ఏడు సంవత్సరాల ఐపీఎస్ సర్వీస్ ఉండగానే తాను ఉద్యోగాన్ని వదిలేశానని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో తన మిత్రులు డీజీపీలుగా ఉన్నారని... సర్వీసులో ఉంటే తనకు కూడా డీజీపీ హోదా వచ్చేదని చెప్పారు. డీజీపీ అయితే తనకే లాభమని... కానీ, బలహీన వర్గాల ప్రజల కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.