ఆ పదమూడు మంది ఏమయ్యారో.. సిగాచి ఫ్యాక్టరీ పేలుడు తర్వాత మిస్సింగ్
గుర్తించిన మృతదేహాల వివరాల ఆధారంగా 14 మంది చనిపోయారని అధికారికంగా ప్రకటించారు. మిగతా మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, కంపెనీ మాత్రం ఆ సమయంలో 156 మంది విధుల్లో ఉన్నారని చెబుతోంది. మరో పదమూడు మంది సిబ్బంది కనిపించడంలేదని తెలిపింది. ఫ్యాక్టరీలో శిథిలాల తొలగింపు పూర్తయ్యాకే ఈ పదమూడు మంది కార్మికులు, సిబ్బందికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, సిగాచి పరిశ్రమ వద్ద మూడో రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ క్రేన్లు, జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు.