రెండు రోజుల్లో బాంబు పేలుళ్లు.. ముంబయి పోలీసులకు బెదిరింపులు
దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో రెండు రోజుల్లో భారీ పేలుళ్లు జరుగుతాయని ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ముంబయి పోలీసు కంట్రోల్ రూమ్‌కు మెయిల్ పంపారు. ఈ బెదిరింపులను తేలికగా తీసుకోవద్దని కూడా హెచ్చరించారు.
ఇక, ఈ బెదిరింపులతో అప్రమత్తమైన అధికారులు ఈ మెయిల్‌ను ఎవరు పంపారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ద్వారా మెయిల్ పంపిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే భద్రతాపరమైన చర్యలు కూడా చేపట్టారు.