ఉద్రిక్తతల వేళ చీకట్లో పెళ్లి.. సెల్ఫోన్ల వెలుగులో ఏడడుగులు!
- రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో బ్లాక్అవుట్
- వైమానిక దాడుల నుంచి రక్షణ కోసం విద్యుత్ నిలిపివేత.
- జోధ్‌పూర్‌లోని పావ్టాలో సెల్ఫోన్ల వెలుగులో జరిగిన వివాహ వేడుక
- సప్తపది సమయంలో కరెంట్ పోవడంతో అతిథుల మొబైల్ లైట్లతో తంతు పూర్తి
ఈ ఊహించని పరిణామంతో పెళ్లి మండపంలో కాసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ, పెళ్లికి హాజరైన అతిథులు వెంటనే తేరుకున్నారు. తమ వద్దనున్న సెల్‌ఫోన్ లైట్లను ఆన్‌చేసి, ఆ వెలుగులోనే వధూవరులతో ఏడడుగులు నడిపించారు. అనంతరం, పురోహితుడు అదే మొబైల్ కాంతుల మధ్య మంత్రోచ్ఛారణ చేస్తూ మిగిలిన వివాహ క్రతువులను పూర్తి చేయించారు.
ఈ సందర్భంగా వరుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. పెళ్లి తంతు కంటే దేశ భద్రతే తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సంయమనం పాటిస్తూ, అధికారుల సూచనలకు అనుగుణంగా వివాహాన్ని పూర్తి చేసుకోవడం విశేషం. ఈ ఘటన దేశభద్రత పట్ల పౌరులకున్న బాధ్యతను, సహకారాన్ని తెలియజేస్తోంది.