ఉద్రిక్తతల సమయంలో ఆటవిడుపు... సాంబ రిలీఫ్ క్యాంప్ లో క్రికెట్ ఆడిన సీఎం ఒమర్ అబ్దుల్లా
- జమ్మూకశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో సహాయక శిబిరాల ఏర్పాటు
- సాంబ శిబిరం వద్ద బాలుడితో క్రికెట్ ఆడిన ఒమర్ అబ్దుల్లా
- శిబిరాల్లో ఆహారం, వైద్యం అందిస్తున్నామన్న సీఎం
సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల గురించి విలేకరులతో మాట్లాడుతూ, శిబిరాల్లో ఉంటున్నంత కాలం పౌరులు తక్కువ సమస్యలను ఎదుర్కొనేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
"మేము చేయగలిగినదంతా చేస్తున్నాం. రోజుకు మూడు పూటలా ఆహారం అందిస్తున్నాం, పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, అన్ని శిబిరాల్లో వైద్యులు అందుబాటులో ఉన్నారు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం... ఇక్కడ ఉండటం వల్ల వారు సాధ్యమైనంత తక్కువ సమస్యలను ఎదుర్కొనేలా చూస్తున్నాం" అని ఆయన వివరించారు. అంతకుముందు, పూంచ్‌లో జరిగిన పాకిస్థాన్ షెల్లింగ్‌లో గాయపడిన వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్లారు.