సరిహద్దుల్లో పాక్ కాల్పులు.. తెలుగు జవాన్ వీర మరణం
- జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ మృతి
- వీర జవాన్‌ది ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా
- శనివారం స్వగ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం
వీర జవాన్‌ది ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని కల్లి తండా. గురువారం రాత్రి సరిహద్దు వెంబడి పాక్ కాల్పులు జరపగా మన సైన్యం కూడా దీటుగానే బదులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో మురళీ నాయక్ చనిపోయినట్లు సమాచారం. శనివారం స్వగ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానున్నట్లు తెలుస్తోంది.
కాగా, వీర జవాన్ మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెరువుతండాలో పెరిగాడు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌లో చదివాడు. జవాన్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్వగ్రామం కల్లితండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.