పాకిస్థాన్ కు ఘనవిజయం... సెటైర్ వేసిన ప్రముఖ క్రికెట్ అంపైర్
- ఆపరేషన్ సిందూర్ తో విరుచుకుపడిన భారత సైన్యం
- పాక్ నెటిజన్ల తీరుపై అంపైర్ కెటిల్ బరో వ్యంగ్యం
- వీడియో గేమ్ దృశ్యాలే వైమానిక దళ విజయాలట!
- సోషల్ మీడియాలో పాక్ తీరుపై సెటైర్లు
పాకిస్థాన్‌కు చెందిన పలువురు సోషల్ మీడియా వినియోగదారులు, ఎక్స్ వేదికగా, వివిధ వీడియో గేమ్‌లకు సంబంధించిన క్లిప్పింగులను పోస్ట్ చేస్తూ, అవి తమ పాకిస్థాన్ వైమానిక దళం సాధించిన ఘన విజయాలని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ వీడియోలో ఓ యుద్ధ విమానం శతఘ్ని కాల్పుల్లో కూలిపోయినట్టు కనిపించింది. అయితే వాస్తవ దూరమైన ఈ ప్రచారం కాసేపట్లోనే నవ్వులపాలైంది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ క్రికెట్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో స్పందించారు.
"పాకిస్థాన్ వైమానిక దళం 'గేమ్ ప్లే'లో సాధించిన ఈ భారీ విజయం నిజంగా అమోఘం. కొన్నిసార్లు మైదానంలో జరిగే అసలు ఆట కంటే ఇలాంటి 'ఆఫ్-ఫీల్డ్' ప్రదర్శనలే ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తాయి!" అని ఆయన ఎత్తిపొడిచారు.