వెలగపూడిలో మోదీకి ఘన స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
- రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి చేరుకున్న ప్రధాని మోదీ
- సభా ప్రాంగణానికి ప్రధానితో పాటు బయల్దేరిన సీఎం, డిప్యూటీ సీఎం
- 18 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న పీఎం
కాసేట్లో ప్రధాని రాజధాని అమరావతి పనులతో పాటు, 18 ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సభాస్థలి ఇప్పటికే లక్షలాది మందితో కిటకిటలాడుతోంది. సభకు పెద్ద సంఖ్యలో అమరావతి రైతులు హాజరయ్యారు. తమ కల సాకారమవుతోందని వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు.