భారత్ వైమానిక దాడులకు దిగుతుందని నిద్రలేని రాత్రులు గడుపుతున్న పాక్.. సరిహద్దుకు రాడార్ వ్యవస్థ తరలింపు
- భారత నుంచి ప్రతీకారం తప్పదని భయపడుతున్న పాకిస్థాన్
- భారత సైన్యం కదలికలను గుర్తించేందుకు సరిహద్దుల్లో రాడార్ వ్యవస్థను మోహరింపు
- చోర్ కంటోన్మెంట్ సైట్‌లో టీపీఎస్-77 రాడార్‌ను మోహరించిన పాక్
తాజాగా, అంతర్జాతీయ సరిహద్దుకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోర్ కంటోన్మెంట్ సైట్‌లో పాకిస్థాన్ టీపీఎస్-77 రాడార్‌ను మోహరించింది. టీపీఎస్-77 మల్టీ రోల్ రాడార్ (ఎంఆర్ఆర్) అనేది అత్యాధునిక సామర్థ్యం కలిగిన రాడార్ వ్యవస్థ. వైమానిక ట్రాఫిక్‌ను పర్యవేక్షించేందుకు దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. మరోవైపు, పాకిస్థాన్ వరుసగా ఐదో రోజు కూడా నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా కుప్వారా, బారాముల్లా, అఖ్నూర్ సెక్టార్లపై కాల్పులు జరిపింది. భారత సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టింది.