ఆ హంతకులలో నా కొడుకు ఉంటే కాల్చి చంపండి.. టెర్రరిస్ట్ ఆదిల్ తల్లి
- 2018 లో ఇంటి నుంచి వెళ్లిపోయాడని వెల్లడి
- తన కొడుకు ఆ పని చేసి ఉండడని అంటున్న షాజాదా బానో
- ఆదిల్ కోసం భద్రతా బలగాల వేట.. లొంగిపొమ్మంటూ బానో విజ్ఞప్తి
- గురీ గ్రామంలోని ఆదిల్ ఇంటిని కూల్చివేసిన భద్రతా బలగాలు
2018లో ఆదిల్ పాకిస్థాన్‌కు వెళ్లాడని, స్టడీ వీసాపై అక్కడికి వెళ్లి ఉగ్రవాదులతో కలిశాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 2024లో నియంత్రణ రేఖ ద్వారా తిరిగి భారత్‌లోకి ప్రవేశించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆదిల్ తండ్రి వలీమ్ మొహమ్మద్ థోకర్, సోదరులు జాహిర్, అర్ష్‌లామ్, కజిన్‌లు జులంకర్, సజ్జాద్‌లను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తన భర్త, కుమారులు నిర్బంధంలో ఉన్నారని, ఇల్లు కూలిపోయిందని, ఇప్పుడు తన పరిస్థితి ఏమిటని షాజాదా బానో విలపించారు.