Jeevan Reddy: ఆ విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డితోనే పోటీపడ్డాను: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి

Jeevan Reddy Rivals YS Rajasekhar Reddy Congress Leaders Remark

  • తనకు ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తులతోనే పోటీ ఉంటుందని వ్యాఖ్య
  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై విమర్శలు
  • పదేళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్న
  • బీఆర్ఎస్ అరాచకాలపై పోరాడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చామని వ్యాఖ్య

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పోటీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతోనే ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో అభివృద్ధి విషయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోటీ పడ్డానని గుర్తు చేసుకున్నారు.

జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన, జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్‌పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యే పనితీరును ప్రశ్నించారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు కొత్తగా జరుగుతుందా? అని నిలదీశారు. ఎమ్మెల్యే సంజయ్‌కు తమ కంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉందా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అరాచకాలపై తాము నిరంతరం పోరాటం చేశామని, ఆ పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని జీవన్ రెడ్డి అన్నారు.

Jeevan Reddy
Congress Party
YS Rajasekhar Reddy
Sanjay Kumar
Jagtial MLA
Telangana Politics
BRS
Development
Political rivalry
Telangana
  • Loading...

More Telugu News