Vaibhav Suryavanshi: ఈ కుర్రాడు మామూలోడు కాదు... 14 ఏళ్లకే ఐపీఎల్... మొదటి బంతికే సిక్స్!

- ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశి
- 14 ఏళ్ల వయసుకే ఐపీఎల్ అరంగేట్రం
- శార్దూల్ ఠాకూర్ విసిరిన బంతిని సిక్సర్ బాదిన వైనం
బీహార్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల వయసుకే ఐపీఎల్ ఆడుతున్న అత్యంత పిన్న వయసు క్రికెటర్ గా నిలిచాడు. ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఈ కుర్రాడు ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ గా బరిలో దిగాడు.
యశస్వి జైస్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన సూర్యవంశి... తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్స్ కొట్టి తన అరంగేట్రాన్ని అదిరిపోయే రీతిలో చాటాడు. ఆ బంతి వేసింది ఏదో అల్లాటప్పా బౌలర్ కాదు. సీనియర్ బౌలర్ శార్దూల్ ఠాకూర్. శార్దూల్ ఠాకూర్ విసిరిన ఆ బంతి స్వింగ్ అయినప్పటికీ, ఏమాత్రంలెక్కచేయనిసూర్యవంశి కాస్త వెనక్కి జరిగి కవర్స్ మీదుగా భారీ సిక్స్ గా మలిచాడు.
మొత్తమ్మీద ఈ ఇన్నింగ్స్ వైభవ్ సూర్యవంశి 20 బంతుల్లో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. 181 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 113 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 55, కెప్టెన్ రియాన్ పరాగ్ 15 పరుగులతో ఆడుతున్నారు.