విజయసాయి ఒక బట్టేబాజ్... త్వరలోనే అతడి చరిత్ర మొత్తం చెబుతా: రాజ్ కసిరెడ్డి

19-04-2025 Sat 17:40 | Andhra
Advertisement
  • ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు
  • ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు ఇచ్చిన సిట్
  • అజ్ఞాతం నుంచి ఆడియో సందేశం వెలువరించిన రాజ్ కసిరెడ్డి
Advertisement
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి తాజాగా ఓ ఆడియో సందేశం వెలువరించారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణల పట్ల ఆయన ఈ ఆడియో క్లిప్పింగ్ ద్వారా బదులిచ్చారు. ఏపీ లిక్కర్ స్కాంను దర్యాప్తు చేస్తున్న సిట్ వరుస నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో, రాజ్ కసిరెడ్డి అజ్ఞాతం నుంచి ఆడియో సందేశం పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఆడియో క్లిప్పింగ్ లో రాజ్ కసిరెడ్డి ఏమన్నారంటే... "లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సిట్ అధికారులు నాకు రెండు సార్లు నోటీసులు పంపారు. నాపై వచ్చిన ఆరోపణల పట్ల నేను న్యాయపరంగా పోరాటం చేస్తున్నా. సిట్ నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. నిర్ణీత సమయం ఇచ్చి నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. న్యాయపరమైన రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ముందస్తు బెయిల్ కోసం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నా. 

మద్యం కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదు. న్యాయపోరాటం ముగిశాక మీడియాను పిలిచి విజయసాయిరెడ్డి చరిత్ర మొత్తం చెబుతా" అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజ్ కసిరెడ్డి... విజయసాయిని 'బట్టేబాజ్ మనిషి' అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఒకవైపు వాదనలు విని మీడియాలో వార్తలు ప్రసారం చేయొద్దని, తన వాదన కూడా వినాలని, త్వరలోనే మీడియా ముందుకు వచ్చి విజయసాయి వ్యవహారంతో సహా అన్ని విషయాలు చెబుతానని వెల్లడించారు. 

కాగా, సిట్  నోటీసులకు తాను స్పందించానని రాజ్ కసిరెడ్డి వెల్లడించారు. నోటీసులపై తన న్యాయవాదులను సంప్రదించగా, సిట్ మిమ్మల్ని సాక్షిగా పేర్కొంటోందని, అయితే అరెస్ట్ చేసే అవకాశముందని వారు చెప్పారని వివరించారు. తనకు సిట్ రెండుసార్లు నోటీసులు ఇచ్చిందని కసిరెడ్డి ఆడియోలో అంగీకరించారు. మొదటి నోటీసు తాను లేని సమయంలో తన తల్లికి ఇచ్చారని, రెండో నోటీసు మెయిల్ ద్వారా పంపి మరుసటి రోజే విచారణకు రమ్మన్నారని తెలిపారు. విచారణకు సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తనను ఎందుకు విచారణకు పిలుస్తున్నారో స్పష్టం చేయాలని సిట్ ను కోరినట్లు తెలిపారు.
Advertisement
Raj Kasi ReddyVijay Sai ReddyAP Liquor ScamSIT NoticesAndhra PradeshSupreme CourtAudio MessagePolitical ControversyLegal BattleBail Plea

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more