పవన్ కల్యాణ్ భార్యపై ట్రోలింగ్... ఘాటుగా స్పందించిన విజయశాంతి
- తిరుమలలో తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా
- పుణ్యక్షేత్రాల వద్ద మహిళలు తలనీలాలు సమర్పించడం సరికాదంటూ ట్రోలింగ్
- హిందూ ధర్మాన్ని విశ్వసించిన లెజినోవాను ట్రోల్ చేయడం సరికాదన్న విజయశాంతి
మరోవైపు, లెజినోవాను కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఆమె తలనీలాలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. సనాతనంలో మహిళలు పుణ్యక్షేత్రాల వద్ద తలనీలాలు సమర్పించడం సరికాదని అంటున్నారు. ఈ ట్రోల్స్ పై సీనియర్ సినీ నటి విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
"అన్నా లెజినోవా గారు దేశం కాని దేశం నుంచి వచ్చారు. పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ... ఆమె హిందూ ధర్మాన్ని విశ్వసించారు. ఆమెను కొందరు ట్రోల్ చేయడం సమంజసం కాదు. దురదృష్టకర అగ్నిప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడేందుకు కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడి కరుణాకటాక్షాలే కారణమనే విశ్వాసంతో శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్ కు విరాళం కూడా ఇచ్చారు. హిందూ సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాను ట్రోల్ చేయడం సరికాదు" అని విజయశాంతి అన్నారు.