వేలంలో రూ.25 వేలు పలికిన నిమ్మకాయ
- తమిళనాడులోని ఈరోడ్‌లోని ఓ దేవాలయంలో వేలం
- సదాయప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
- స్వామివారి పూజలో ఉంచిన నిమ్మకాయను వేలం వేసిన అధికారులు
ఈ వేలంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కందసామిపాలెం నుంచి వచ్చిన ఒక భక్తుడు రూ. 25 వేలకు ఆ నిమ్మకాయను సొంతం చేసుకున్నారు. తమిళనాడు నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామి వారి పూజకు ఉపయోగించిన సామగ్రిని వేలం వేయడం ఆనవాయతీ అని ఆలయ అధికారులు తెలిపారు.