సంపూ హవా మళ్లీ మొదలయ్యేనా?
- గ్యాప్ నిజమేనంటున్న సంపూ
- ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'సోదరా'
- అన్నదమ్ముల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ
- ఈ నెల 25వ తేదీన విడుదల
సాధారణంగా హీరోగా ఒకటి రెండు ఫ్లాపులు పడగానే, ఎవరైనా సరే కంగారుపడిపోయి కమెడియన్ గా వెనక్కి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ఒక ఆదుర్దా కూడా మనకి సంపూలో కనిపించదు. అలాంటి సంపూకి ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. అనుకున్న సినిమాలు ప్రమోషన్స్ స్థాయిలో ఆగిపోవడమే అందుకు కారణమని సంపూ నిజాయితీగా చెబుతూ వెళుతున్నాడు. అలాంటి ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'సోదరా' సినిమా సిద్ధమవుతోంది.
ఈ నెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. అన్నదమ్ముల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. ఇంతవరకూ సంపూ సినిమాలన్నీ కూడా టైటిల్ దగ్గర నుంచే కామెడీని టచ్ చేస్తూ వచ్చాయి. కానీ అందుకు భిన్నంగా ఈ సారి ఆయన 'సోదరా' అనే ఒక సాదాసీదా టైటిల్ తో .. తన ఇమేజ్ కి భిన్నమైన ఎమోషన్స్ వైపు నుంచి వస్తున్నాడు. ఈ సినిమాతో సంపూ హవా మళ్లీ జోరందుకుంటుందేమో చూడాలి మరి.