రజత్ పాటిదార్ కు భారీ జరిమానా.. కారణం ఇదే!
- స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల ఫైన్
- ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ కు జరిమానా
- ముంబైపై 64 పరుగులు చేసిన పాటిదార్
ఎంఐ, ఆర్సీబీల మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో రజత్ పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగు సిక్సర్లతో పాటు ఐదు బౌండరీలతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 32 బంతుల్లో 64 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.