ఏటీఎం కార్డు సైజులో రేషన్ కార్డులు... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

01-04-2025 Tue 17:44 | Andhra
Advertisement
  • కొత్త రకం రేషన్ కార్డులు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
  • ఈ-కేవైసీ పూర్తయ్యాక కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మంత్రి నాదెండ్ల
  • నేటి నుంచి దీపం-2 రెండో విడత సిలిండర్ బుకింగ్
Advertisement
రేషన్ కార్డులపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులోనే వస్తాయని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మే నెల నుంచి ఈ కొత్త రకం రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. ఈ-కేవైసీ పూర్తయ్యాక కొత్త రేషన్ కార్డులు జారీ ఉంటుందని తెలిపారు. 

ఇందులో కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఉంటాయని మంత్రి నాదెండ్ల వివరించారు. క్యూఆర్ కోడ్, ఇతర సెక్యూరిటీ ఫీచర్లతో ఈ కొత్త తరహా రేషన్ కార్డులు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ-కేవైసీ పూర్తయ్యాక ఎంతమందికి కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని అన్నారు. 

నేటి నుంచి దీపం-2 రెండో విడత సిలిండర్ బుకింగ్

దీపం-2 పథకంలో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నేటి నుంచి దీపం-2 రెండో విడత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని తెలిపారు. కొత్తగా 2 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారని గ్యాస్ కంపెనీలు చెప్పాయని వివరించారు. 

జూన్ నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం

జూన్ నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. ఎండీయూల కొనుగోలు పెద్ద కుంభకోణమని, దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఖరీఫ్ లో 35.93 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. వాట్సాప్ ద్వారా కూడా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నిర్వహించేలా వెసులుబాటు కల్పించామని అన్నారు. మొత్తం 16 వేల మంది రైతులు వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్మకం సదుపాయాన్ని వినియోగించుకున్నారని మంత్రి వెల్లడించారు. 

ఏపీ పోర్టుల ద్వారా తెలంగాణ బియ్యం ఎగుమతులు

ఏపీ పోర్టుల ద్వారా తెలంగాణ లక్షన్నర టన్నుల బియ్యం ఎగుమతి చేసిందని మంత్రి నాదెండ్ల తెలిపారు. తెలంగాణ ఎగుమతులకు కేంద్రం అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. 
Advertisement
Nadeendla ManoharAndhra Pradesh Ration CardsATM Card Size Ration CardAP Government SchemesDeepa-2 Gas Cylinder BookingMidday Meal SchemeRice ProcurementTelangana Rice Exportse-KYCQR Code Ration Card

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more