బాలిక హత్య కేసు.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన చోడవరం కోర్టు
- ఏడేళ్ల బాలికను బీరు సీసాతో గొంతుకోసి హత్య చేసిన శుభాచారి శేఖర్
- సుదీర్ఘ విచారణ తర్వాత నిందితుడికి ఈరోజు ఉరిశిక్ష ఖరారు చేసిన చోడవరం కోర్టు
- ఈ మేరకు 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ తీర్పు
- చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచండం ఇదే తొలిసారి
దేవరాపల్లికి చెందిన శేఖర్‌కు మరణశిక్ష విధిస్తూ 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ ఈ మేరకు తీర్పునిచ్చారు. 2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించడం ఇదే మొదటిసారి.