భూమ్మీద నూకలు మిగిలి ఉండటం అంటే ఇదేనేమో... వీడియో ఇదిగో!

భూమ్మీద నూకలు మిగిలి ఉండటం అంటే ఇదేనేమో... వీడియో ఇదిగో!

Delivery Boys Miraculous Escape from Falling Tree Caught on CCTV
     
భూమ్మీద ఇంకా ఆయుష్షు ఉండటం అంటే ఇదేనేమో. ఓ డెలివరీ బాయ్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ డెలివరీ బాయ్ స్కూటర్‌పై వెళుతుండగా, ఒక్కసారిగా భారీ చెట్టు కూలిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆ మార్గం గుండా వెళుతున్న డెలివరీ బాయ్ క్షణాల్లో స్పందించి తప్పించుకున్నాడు. వెన్ను జలదిరించే ఈ ఘటన మహారాష్ట్రలోని విరార్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. చెట్టు కొమ్మలు పడటంతో డెలివరీ బాయ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
Advertisement
Delivery Boy
Miraculous Escape
Tree Falls
Viral Video
CCTV Footage
Near-Death Experience
Accident
Maharashtra
Virar

More Telugu News