లిటిల్ ఫ్యాన్‌కు లైఫ్ టైమ్ మెమరీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. ఇదిగో వీడియో!
'కోహ్లీ భయ్యా ఆటోగ్రాఫ్' అని అరుస్తూ విరాట్‌ను అనుసరించాడు. కొన్ని గంటల నిరీక్షణ తర్వాత ఆ బుడ్డోడిని కోహ్లీ గుర్తించాడు. ప్రాక్టీస్ ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో బస్‌లో కూర్చున్న రన్ మెషీన్... ఆ బుడ్డోడు ఇచ్చిన ఫొటోపై ఆటోగ్రాఫ్ చేసిచ్చాడు. ఇలా ఆ లిటిల్ ఫ్యాన్‌కు కోహ్లీ లైఫ్ టైమ్ మెమరీని అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ తమదైనశైలిలో స్పందిస్తున్నారు.