కూతురు సితార‌తో మ‌హేశ్‌ బాబు యాడ్.. క్యూట్ వీడియో చూశారా?

కూతురు సితార‌తో మ‌హేశ్‌ బాబు యాడ్.. క్యూట్ వీడియో చూశారా?

Mahesh Babu and Sitaras Adorable New Ad Goes Viral
   
తన తండ్రి మహేశ్‌ బాబుతో కలిసి సితార తాజాగా ఓ యాడ్‌లో న‌టించింది. ఈ యాడ్ తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇందులో సితార-మహేశ్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. షాపింగ్ బాగా ఎంజాయ్ చేశాం కదా అంటూ మహేశ్ అన‌గానే... అవును నాన్నా అంటూ ఆయ‌న‌పై ఓ డ్రెస్ విసిరేస్తుంది సితార‌.

దాంతో వెంట‌నే మ‌హేశ్‌ కాస్ట్యూమ్ మారిపోతుంది. అలా మ‌హేశ్‌ కూడా సితార‌పై బ‌ట్ట‌లు విసురుతారు. అలా ఒక‌రిపై ఒక‌రు బ‌ట్ట‌లు విసురుకుంటూ తండ్రీకూతురు కొత్త కాస్ట్యూమ్స్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంటారు. ప్ర‌స్తుతం ఈ యాడ్ అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ యాడ్‌లో మహేశ్‌ కొంచెం గడ్డంతో క్లాసిక్ లుక్‌లో కనిపించారు. ఇక సితార అయితే చిరున‌వ్వులతో ఎంతో క్యూట్‌గా క‌నిపించింది.

కాగా, మ‌హేశ్‌ బాబు సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్‌ రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ఓ మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఎస్ఎస్‌29 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. సూప‌ర్ స్టార్ ప‌క్క‌న‌ ప్రియాంకా చోప్రా న‌టిస్తున్న ఈ సినిమాలో కీల‌క పాత్రలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ క‌నిపించ‌నున్నారు. 

ఈ చిత్రాన్ని టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత కేఎల్ నారాయ‌ణ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా ఉంటుంద‌ని కథా ర‌చ‌యిత విజయేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా భాగం కానున్నారు. 
Advertisement
Mahesh Babu
Sitara Ghattamaneni
New Ad
Viral Video
Cute Video
SS Rajamouli
Priyanka Chopra
S S 29
Telugu Cinema
Tollywood

More Telugu News