పదో తరగతి పరీక్షలు రాస్తున్న నా యువ నేస్తాలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
- ఏపీలో రేపటి నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్
- సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపిన సీఎం చంద్రబాబు
- మీపై మీరు నమ్మకం ఉంచితే విజయం తథ్యం అంటూ ఆశీస్సులు
ఏపీలో పదో తరగతి పరీక్షలు రేపు (మార్చి 17) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.