బెట్టింగ్ యాప్స్ వ్యవహారం... యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు
- బెట్టింగ్ యాప్స్ ను సీరియస్ గా తీసుకున్న వీసీ సజ్జనార్
- గట్టిగా ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం
- హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడి
ఇటీవల హర్షసాయి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బెట్టింగ్ యాప్స్ ను తాను ప్రమోట్ చేయకపోతే ఇతరులు ప్రమోట్ చేస్తారని... ఆ డబ్బును ఎందుకు పోగొట్టుకోవడం... అందుకే బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం కల్పిస్తున్నానని చెప్పాడు. అంతేకాదు, ఆ విధంగా వచ్చిన డబ్బును పేదలకు పంచుతున్నానని వెల్లడించాడు. ఈ వీడియోను చూసిన సజ్జనార్... హర్షసాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.