రాష్ట్రంలో వచ్చే నెల నుంచి కొత్త రేషన్‌ కార్డులు మంజూరు: మంత్రి నాదెండ్ల మనోహర్

22-02-2025 Sat 20:00 | Andhra
Advertisement
  • నెల్లూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల పర్యటన 
  • సంగంలో రైసుమిల్లు, జెండా దిబ్బలో స్టాక్‌పాయింట్‌ను తనిఖీ చేసిన మంత్రి
  • క్యూఆర్ కోడ్ తో కూడిన రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడి 
Advertisement
రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల నుంచి కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. ఈ రేషన్ కార్డులు ఆధునిక టెక్నాలజీతో క్యూ ఆర్ కోడ్ లను కలిగి ఉంటాయని తెలిపారు. 

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగం సమీపంలోని రైసుమిల్లును, జెండాదిబ్బ వద్దనున్న బహుళ ప్రయోజన సౌకర్య గోదాము (స్టాక్‌ పాయింట్‌)ను మంత్రి తనిఖీ చేశారు. రైసుమిల్లును తనిఖీ చేసి ధాన్యం సేకరణకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెండా దిబ్బ వద్ద స్టాక్ పాయింట్‌ను తనిఖీ చేసి స్టాకు వివరాలు, సరఫరా మొదలైన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్‌ మహిళలనుద్దేశించి మాట్లాడారు. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమన్నారు. మహిళలందరూ కూడా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 

వచ్చే నెల నుంచి కొత్త రేషన్‌ కార్డులను అందిస్తామని చెప్పారు. రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దీపం-2 పథకం హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారని, ఇందులో భాగంగా ఈ జిల్లాలో 4 లక్షల మందికి ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. 

రాష్ట్రంలో 93.42 లక్షల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని, ఈ ఏడాది 1.50 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారం మహిళలందరూ తెలుసుకోవాలని, భాగస్వామ్యం కావాలని సూచించారు. మే నెల నుంచి అన్ని సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కోసం మంచి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు. 
Advertisement
New Ration CardsNadendla ManoharAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more