బ్యాంకర్లతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం... కీలక అంశాలపై చర్చ
- అమరావతిలో ఎస్ఎల్బీసీ సమావేశం
- హాజరైన బ్యాంకర్లు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు
- బ్యాంకులు విజన్-2047కి అండగా నిలవాలన్న చంద్రబాబు
ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు సహకరించాలని బ్యాంకర్లను కోరారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పనిచేసేందుకు ప్రభుత్వంతో బ్యాంకులు చేయి కలపాలని సూచించారు.
అగ్రికల్చర్ స్థానంలో హార్టికల్చర్ ప్రముఖ పాత్ర పోషించనుందని... హార్టీకల్చర్, ప్రకృతి వ్యవసాయ రంగాలకు బ్యాంకులు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా, బ్యాంకులు విజన్-2047కి అండగా నిలవాలని కోరారు.