అబిడ్స్ సీఐపై అదనపు కట్నం కేసులో ట్విస్ట్
- భార్యకు అక్రమ సంబంధం ఉందని సీఐ ఆరోపణ
- ప్రియుడి ద్వారా గర్భం రావడంతో అబార్షన్ చేయించుకుందన్న సీఐ
- బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు భార్యపై ఆరోపణలు చేసిన సీఐ నరసింహ
ఈ వ్యవహారంపై గతంలో ఎస్పీ కార్యాలయంలో పంచాయతీ చేసి భార్యను తెచ్చుకున్నట్లు సీఐ నరసింహ తెలిపారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కూడా తన సంబంధం కొనసాగించిందని, గంటల తరబడి ఫోన్ లో మాట్లాడేదని ఆరోపించారు. పుట్టింటికి వెళ్లిన సమయంలో నకిరేకల్ లో ప్రయివేటు గా ప్రియుడిని కలుసుకునేదని చెప్పారు. ఇవన్నీ తెలిసినా పిల్లల కోసం, కుటుంబం పరువు కోసం ఓపిగ్గా భరించానని నరసింహ తెలిపారు. అక్రమ సంబంధంపై నిలదీస్తే కేసు పెట్టి ఉద్యోగం ఊడగొడతానంటూ బ్లాక్ మెయిల్ చేసిందని నరసింహ ఆరోపించారు.