తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ ఇదిగో!
- ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
- మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్
- జూన్ 11 నుంచి 14 వరకు పీఈ సెట్ పరీక్షలు
తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్‌ను కాకతీయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది. మార్చి 10న ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.