ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి నారా లోకేశ్
- డీఎస్సీ అభ్యర్థులకు తియ్యని కబురు చెప్పిన కూటమి ప్రభుత్వం
- మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్
- విద్యా సంవత్సరం ప్రారంభంలోపే నియామకాలు పూర్తి
మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రలో 80 శాతం టీచర్ నియామకాలు చేపట్టింది తామేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతోందని, విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో టీచర్ల అభిప్రాయాలు ఉంటాయని వివరించారు.
విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయుల సమస్యలు వింటున్నారని, ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత కోసం ట్రాన్స్ ఫర్ యాక్ట్ తీసుకువస్తున్నామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.
విద్యా వ్యవస్థలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదని, అందుకే తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో భాగస్వాములతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.