నా దృష్టిలో మీరు ఎన్ఆర్ఐలు కాదు: జ్యూరిచ్ లో ప్రవాసాంధ్రులతో లోకేశ్ సమావేశం

20-01-2025 Mon 19:31 | Andhra
Advertisement
  • జ్యూరిచ్ లో తెలుగు ఎన్నారైలతో లోకేశ్ ఆత్మీయ సమావేశం
  • మీరు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ (MRI) అని కితాబు
  • ఎన్నారైలు ఎక్కడున్నా టీడీపీకి అండగా నిలుస్తున్నారని వెల్లడి
Advertisement
రాష్ట్రంతో భావోద్వేగ బంధంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర వహిస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. 2023 ఆర్బీఐ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ఆర్ఐల ద్వారా భారతదేశంలోనే అత్యధికంగా 40,000 కోట్లకు పైగా రెమిటెన్స్‌లను అందుకుందని అన్నారు. జ్యురిచ్ లో తెలుగు డయాస్పోరా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నా దృష్టిలో మీరు ఎన్ఆర్ఐ (NRI)లు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కాదు... అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ (MRI ) అని అభివర్ణించారు. తెలుగు ప్రవాసాంధ్రులు ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు. 

"ఏపీలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినప్పుడు,  అక్రమ అరెస్టులు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మీరు భారీఎత్తున చేపట్టిన నిరసనలను యావత్ భారతదేశం చూసింది. ఎన్ఆర్ఐలపై మాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి. అందుకే గత ఎన్నికల్లో నలుగుర్ని ప్రవాసాంధ్రులను ఎమ్మెల్యేలను చేయడమేగాక, మరికొందరికి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చాం" అని లోకేశ్ వివరించారు.

జ్యూరిచ్ లో ఉన్నానా లేక జువ్వలపాలెంలో ఉన్నానా..!

ఇక్కడ పరిస్థితులు చూస్తే నేను జ్యూరిచ్ లో ఉన్నానా, జువ్వలపాలెంలో ఉన్నానా అన్న అనుమానం కలుగుతోంది. జ్యురిచ్ లో ఇంతమంది తెలుగువారిని ఒకేచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచాన్ని ఏలే సత్తా తెలుగువారికి మాత్రమే ఉంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది విశ్వవిఖ్యాత స్వర్గీయ నందమూరి తారకరామారావు. తెలుగువారిని ప్రపంచపటంలో నిలబెట్టింది మన విజనరీ చంద్రన్న. 

ఆనాడు విజన్ – 2020 అంటే ఎగతాళి చేశారు. నాడు ఆయన చెప్పిన ప్రతి మాట ఇప్పుడు  నిజమైంది. న్యూయార్క్ లో చేతిలో ఫైల్... వెనక ఆఫీసర్లు... ఆ ఫోటో గుర్తుందా... మొదటిసారి సీఎం అయినపుడు మన చంద్రన్న యువతకు ఉద్యోగాలు కల్పించాలి, పెట్టుబడులు తేవాలని విదేశాల్లో పర్యటించేవారు. దాని ఫలితమే ఈరోజు మీరు చూస్తున్న హైదరాబాద్. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కంటే ఎక్కువ స్పీడ్ తో ఆయన మళ్లీ పరుగెడుతున్నారు, మమ్మల్ని పరుగెత్తిస్తున్నారు... అని లోకేశ్ వివరించారు.


Advertisement
Nara LokeshAP DiosporaZurichCBNDavosAndhra Pradesh

More Telugu News

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10
..more