శ్రీవారి భక్తులకు మసాలా వడలు... అన్నప్రసాదం మెనూలో మరో ఐటమ్

శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి నిర్ణయించింది. అన్నప్రసాదం మెనూలో అదనంగా మరో ఐటమ్ పెంచాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, మెనూలో మార్పులు చేశారు. కొత్తగా మసాలా వడలు వడ్డించాలని నిర్ణయించారు. 

ట్రయల్ రన్ లో భాగంగా నేడు ఐదు వేల మసాలా వడలను భక్తులకు వడ్డించారు. ఉల్లి, వెల్లుల్లి లేకుండానే ఈ మసాలా వడలు తయారు చేశారు. కాగా, కొన్ని రోజుల పాటు పరిశీలించి, లోటుపాట్లను సవరించుకుని పూర్తి స్థాయిలో మెనూకి రూపకల్పన చేయనునున్నారు. ఈ మేరకు టీటీడీ కసరత్తులు చేస్తోంది. త్వరలోనే వడలతో కూడిన కొత్త మెనూను టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.


More Telugu News