ఆకట్టుకుంటోన్న 'భైరవం' టీజర్
- మనోజ్, సాయి శ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా 'భైరవం'
- విజయ్ కనకమేడల దర్శకత్వం
- ముగ్గురు హీరోల పక్కన కథానాయికలుగా దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది
వారాహి గుడి, ఒక ఊరు నేపథ్యంలో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ఈ ముగ్గురు హీరోల పక్కన దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది కథానాయికలుగా నటించారు. అలాగే జయసుధ, ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.