ఆంధ్రా అల్లుడికి 130 రకాల తెలంగాణ వంటకాలతో విందు.. వీడియో ఇదిగో!
--
క్రాంతి, కల్పన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. నాలుగు నెలల క్రింత పెద్దమ్మాయిని కాకినాడకు చెందిన మల్లికార్జున్ కు ఇచ్చి వివాహం చేశారు. తాజాగా సంక్రాంతి పండుగకు వచ్చిన అల్లుడికి తెలంగాణ వంటకాలను రుచి చూపించాలని భారీగా వంటకాలు చేసిపెట్టారు. తెలంగాణ పిండి వంటలతో పాటు బగారా, పులిహోరా.. ఇలా 130 రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను వడ్డించారు.