తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు
- ఈరోజు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- బుద్ధ భవన్‌లోని బీ-బ్లాక్‌లో త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు
- ఇప్పటికే హైడ్రాకు విస్తృత అవకాశాలు కల్పిస్తూ గెజిట్
హైదరాబాద్ పరిధిలోని చెరువులు, ఇతర ఆస్తులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. అయితే, హైడ్రా ఏర్పాటుపై ప్రశ్నలు వచ్చాయి. దీంతో జీహెచ్ఎంసీ చట్టం 1955ను సవరించారు. చెరువులు, ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ జీహెచ్ఎంసీ చట్టంలో 374 బీ సెక్షన్‌ను చేర్చారు.