కడప పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు: పవన్ కల్యాణ్
- కడప నుంచి ఇద్దరు సీఎంలు అయ్యారన్న పవన్
- ఇక్కడ అన్ని సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నానని వ్యాఖ్య
- పులివెందుల తాగునీటి ప్రాజెక్ట్ కు రూ. 45 కోట్లు ఇచ్చామని వెల్లడి
పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు రూ. 45 కోట్లు ఇచ్చామని పవన్ తెలిపారు. నీటి సమస్యను తీర్చి ఇక్కడి ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇస్తున్నానని చెప్పారు. తాగునీటి విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
రాయలసీమ అంటే వెనకబడిన ప్రాంతం కాదని... అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతమని చెప్పారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయులు పుట్టిన గడ్డ రాయలసీమ అని అన్నారు.