స్నేహితుడు ఆంటోనీతో పెళ్లిపై నటి కీర్తి సురేశ్ అధికారిక ప్రకటన
- వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు కొంతకాలంగా వార్తలు
- ఇద్దరి మధ్య 15 ఏళ్లకుపైగా రిలేషన్
- ఇది ఇకపై జీవితాంతం కొనసాగుతుందని కీర్తి పోస్ట్
- కంగ్రాట్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్న సెలబ్రిటీలు, అభిమానులు
ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆంటోనీ కొంతకాలం పాటు విదేశాల్లో ఉద్యోగం చేశాడు. కేరళలో అతడికి పలు వ్యాపారాలు ఉన్నాయని, ప్రస్తుతం వాటిని చూసుకుంటున్నట్టు తెలిసింది. పెద్దల అంగీకారంతోనే ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నట్టు వార్తలు వస్తున్న వేళ కీర్తి సురేశ్ ఈ అధికారిక ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.