అక్ర‌మ నిర్మాణాల‌పై నోటీసులు.. న‌టుడు అలీ ఏమ‌న్నారంటే..!

Comedian Ali Responded to Village Secretary Notices
  • వికారాబాద్ జిల్లా న‌వాబ్‌పేట్ మండ‌లం ఎక్మామిడిలోని అలీ ఫామ్‌హౌస్‌లో అక్ర‌మ నిర్మాణాలు
  • నోటీసులు ఇచ్చిన గ్రామ కార్య‌ద‌ర్శి శోభారాణి
  • ఒక క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ కోసం త‌న స్థ‌లం లీజుకు ఇచ్చిన‌ట్లు అలీ వెల్ల‌డి
  • నిర్మాణాల‌పై లీజుదారులే స‌మాధానం ఇస్తార‌ని వివ‌ర‌ణ‌
ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న అక్ర‌మ నిర్మాణాల‌పై టాలీవుడ్ హాస్య‌న‌టుడు అలీకి అధికారులు నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌కు జారీ చేసిన నోటీసుల‌పై న‌టుడు అలీ స్పందించారు. ఒక క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ కోసం త‌న స్థ‌లం లీజుకు ఇచ్చిన‌ట్లు చెప్పారు. అందుకే ఆ నిర్మాణాల‌పై లీజుదారులే స‌మాధానం ఇస్తార‌ని తెలిపారు. 

కాగా, తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లా న‌వాబ్‌పేట్ మండ‌లం ఎక్మామిడిలోని ఫామ్‌హౌస్‌లో అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని గ్రామ కార్య‌ద‌ర్శి శోభారాణి అలీకి నోటీసులు ఇచ్చారు. అక్ర‌మ నిర్మాణాల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని అందులో పేర్కొన్నారు. 
Advertisement
Comedian Ali
Tollywood
Telangana
Illegal Constructions

More Telugu News