వావ్.. దర్శకుడు సుకుమార్ ఇంట్లో సహాయకురాలు.. నేడు ప్రభుత్వ ఉద్యోగి!
- దర్శకుడు సుకుమార్ ఇంట్లో సహాయకురాలిగా పనిచేసిన దివ్య
- బాగా చదువుకుని ప్రభుత్వ కొలువు సాధించిన అమ్మాయి
- ఆమె విజయాన్ని ప్రశంసిస్తూ ఇన్‌స్టా వేదికగా సుక్కు భార్య తబిత పోస్టు
"ఎప్పుడూ సినిమా హంగామాల మధ్య, ఈ రోజు మాతో కలిసి ఉండి, మాకు సహాయం చేయడానికి వచ్చిన అమ్మాయి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనందున మా హృదయాలు ఎనలేని ఆనందంతో నిండిపోయాయి. దివ్య తన ఉజ్వల భవిష్యత్తు కోసం రెక్కలు విప్పి పైపైకి ఎగరడం చూస్తుంటే ఆ ఆనందం వర్ణనాతీతం. చాలా తృప్తిగా ఉంది.
ఆమె తన కలల కోసం ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు మేము దివ్యను అభినందిస్తున్నాం. ఆమె ఎదుగుదల, కొత్త ప్రారంభాలకు శుభాకాంక్షలు! నిన్ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది దివ్య!" అని తబిత ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.