Kotamreddy Sridhar Reddy: జగన్ అసెంబ్లీకి రావాలంటే ఒక చిట్కా ఉంది: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kotamreddy tells a plan to bring Jagan to Assembly
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను చూసి చాలా రోజులు అవుతోందని... ఆయన అసెంబ్లీకి కూడా రావడం లేదని చెప్పారు. జగన్ అసెంబ్లీకి రావాలంటే ఒక చిట్కా ఉందని... అసెంబ్లీలో ప్రతిరోజు గంటసేపు మాట్లాడేందుకు సమయం ఇస్తేనే జగన్ వస్తారని, లేకపోతే రారని అన్నారు. ఆయన ఏం మాట్లాడినా ఎవరూ అడ్డు రాకూడదని... అదే ఆయన ఫిలాసఫీ అని ఎద్దేవా చేశారు. ఈరోజు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

2017లో ఆయన పాదయాత్రకు వెళ్తున్న సమయంలో పార్టీ బాధ్యతలను బుగ్గనకు కానీ, మరెవరికైనా కానీ ఇచ్చి వెళ్లాల్సిందని... కానీ ఆయన అలా చేయలేదని... ఎందుకంటే ఆయన మినహా మరెవరూ మాట్లాడటం ఆయనకు ఇష్టం ఉండదని కోటంరెడ్డి అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ సమస్యల కోసం పోరాడలేదని విమర్శించారు. అసెంబ్లీలో మైక్ కోసం పోరాడాలని మాకు చెప్పేవారని అన్నారు. గతంలో కోటంరెడ్డి వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Kotamreddy Sridhar Reddy
Telugudesam
Jagan
YSRCP

More Telugu News