Chandrababu: తమ్ముడి కుమారులను అక్కున జేర్చుకుని ఓదార్చిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

Chandrababu consoles Nara Rohit and Girish
షార్ట్స్‌లో చూడండి
తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూసిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్నారు. మహారాష్ట్రలో ఎన్డీయే తరఫున నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న చంద్రబాబు... హైదరాబాదు చేరుకుని ఏఐజీ ఆసుపత్రిలో తమ్ముడి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. 

బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నేరుగా గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వచ్చిన చంద్రబాబు... తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి కుమారులు నారా రోహిత్, గిరీశ్ లను అక్కన జేర్చుకుని ఓదార్చారు. తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆ ఇద్దరు సోదరులకు పెదనాన్నగా ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. 

కాగా, రామ్మూర్తినాయుడు భౌతికకాయానికి చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ, సుజనా చౌదరి, సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కూడా నివాళులు అర్పించారు.
Go Back to Shorts
Chandrababu
Nara Rammurthy Naidu
Demise
Nara Rohith
Girish
TDP
Andhra Pradesh

More Telugu News