Chandrababu: ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, బాలకృష్ణ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఈ మధ్యాహ్నం కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటు కారణంగా మృతి చెందారు. తమ్ముడి మరణవార్త తెలిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. తమ్ముడి భౌతికకాయానికి ఆయన నివాళి అర్పించారు.

కాసేపటి క్రితమే నందమూరి బాలకృష్ణ కూడా ఆసుపత్రి వద్దకు వచ్చారు. పురందేశ్వరితో పాటు నారా, నందమూరి కుటుంబసభ్యలు ఆసుపత్రి వద్ద ఉన్నారు. తన చిన్నాన్న ఆరోగ్యం విషమించిందన్న వార్త తెలియగానే... నారా లోకేశ్ హుటాహుటిన ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. 

ఇంకోవైపు, చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో రేపు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు ప్రకటించారు.
Chandrababu
Balakrishna
Telugudesam

More Telugu News