New Airports: ఏపీలో ఆరు చోట్ల కొత్త ఎయిర్ పోర్టులు... ఎక్కడంటే!

AP Govt releases funds for new airports in state
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ఆరు చోట్ల కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ మేరకు నిధులు కూడా కేటాయించింది. ఫీజిబిలిటీ అధ్యయనం కోసం ప్రభుత్వం రూ.1.92 కోట్లు విడుదల చేసింది. 

కుప్పం, శ్రీకాకుళం (పలాస), నాగార్జునసాగర్ (సమీపంలో), ఒంగోలు, తాడేపల్లిగూడెం, తుని-అన్నవరం ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం కుప్పంలో 1,501 ఎకరాలు, నాగార్జునసాగర్ సమీపంలో 1,670 ఎకరాలు, తాడేపల్లిగూడెం వద్ద 1,123 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద 1,383 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాలు, తుని-అన్నవరంలో 787 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది. 

నిధులు కేటాయించిన నేపథ్యంలో, సాధ్యమైనంత త్వరగా ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తిచేయాలని ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీని ఆదేశించింది. 
Go Back to Shorts
New Airports
Feasibility Study
Funds
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News