ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రొమాంటిక్ ఎంటర్ టైనర్!
- భారీ హిట్స్ ఇచ్చిన విజయ్ భాస్కర్
- ఆయన తనయుడు హీరోగా రూపొందిన 'ఉషా పరిణయం'
- రొమాంటిక్ ఎంటర్ టైనర్ జోనర్లో సాగే కథ
- ఈ నెల 14వ తేదీ నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్
విజయ్ భాస్కర్ తన తనయుడైన శ్రీ కమల్ ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాను రూపొందించారు. ఆయనే నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, ఆగస్టు 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాతోనే కథానాయికగా 'తన్వీ ఆకాంక్ష' పరిచయమైంది. యూత్ ను మెప్పించే ఈ లవ్ స్టోరీ ఈ నెల 14వ తేదీ నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.
లవ్ .. రొమాన్స్ తో కూడిన కామెడీని టచ్ చేయడంలో విజయ్ భాస్కర్ తనదైన ప్రత్యేకతను కనబరుస్తూ వచ్చారు. అలాంటి ఆయన ఈ సారి పూర్తిస్థాయి రొమాంటిక్ లవ్ స్టోరీని రూపొందించారు. కొత్త హీరో - హీరోయిన్స్ కారణంగా థియేటర్స్ దగ్గర ఓ మాదిరి రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి.