AP Budget: 43 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అచ్చెన్నాయుడు

AP Minister Achem Naidu Speech in Assembly
షార్ట్స్‌లో చూడండి
‘ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నకు మనసావాచా కర్మణా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా’ అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి మంత్రి మాట్లాడారు. ముందుగా రైతులపై ప్రముఖ కవి గుర్రం జాషువా రాసిన..  

‘‘వాని రెక్కల కష్టంబు లేని నాడు 
సస్య రమ పండి పులకింప సంశయించు 
వాడు చెమటోడ్చి ప్రపంచమునకు 
భోజనము పెట్టువానికి భుక్తి లేదు..” 
అన్న కవితను మంత్రి చదివి వినిపించారు. 

రైతులకు ఈ పరిస్థితి మారాలని, రైతే రాజు కావాలని నిరంతరం ఆలోచించే, అందుకోసం నిరంతరం ప్రయత్నించే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే, గత ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి వెన్నెముక వంటి వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్ర జనాభాలో 62 శాతం వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడిందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి, రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ బడ్జెట్ లో పకృతి వ్యవసాయానికి, సాంకేతికతకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగించి భూసార పరీక్షలు చేపట్టనున్నామని మంత్రి వివరించారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా రాయితీపై ఎరువుల పంపిణీ చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. 

కేటాయింపులు..
అన్నదాత సుఖీభవ  - రూ.4,500 కోట్లు 
ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లు
భూసార పరీక్షలకు - రూ.38.88 కోట్లు
పంటల బీమా - రూ.1,023 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ - రూ.187.68 కోట్లు
రాయితీ విత్తనాలకు - రూ.240 కోట్లు
ఎరువుల సరఫరా - రూ.40 కోట్లు
పొలం పిలుస్తోంది - రూ.11.31 కోట్లు
డిజిటల్‌ వ్యవసాయం - రూ.44.77 కోట్లు
వడ్డీ లేని రుణాలకు - రూ.628 కోట్లు
రైతు సేవా కేంద్రాలకు - రూ.26.92 కోట్లు
ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ - రూ.44.03 కోట్లు
విత్తనాల పంపిణీ - రూ.240 కోట్లు
వ్యవసాయ శాఖ - రూ.8,564.37 కోట్లు
ఉద్యాన శాఖ - రూ. 3469.47 కోట్లు
పట్టు పరిశ్రమ - రూ.108.4429 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్ - రూ.314.80 కోట్లు
సహకార శాఖ - రూ.308.26 కోట్లు
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం - రూ.507.038 కోట్లు 
ఉద్యాన  విశ్వవిద్యాలయం - రూ.102.227 కోట్లు 
శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం - రూ.171.72 కోట్లు  
మత్స్య విశ్వవిద్యాలయం - రూ.38 కోట్లు 
పశుసంవర్ధక శాఖ - రూ.1,095.71 కోట్లు 
మత్స్య రంగం అభివృద్ధి - రూ.521.34 కోట్లు 
ఉచిత వ్యవసాయ విద్యుత్ - రూ.7241.30 కోట్లు 
ఉపాధి హామీ అనుసంధానం - రూ.5,150కోట్లు 
ఎన్టీఆర్ జలసిరి - రూ.50 కోట్లు 
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ - రూ.14,637.03 కోట్లు
Go Back to Shorts
AP Budget
Agri budget
Achem Naidu
TDP
Andhra Pradesh
AP Assembly Session

More Telugu News