లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై పాట‌.. సల్మాన్ ఖాన్‌కు మ‌రోసారి బెదిరింపులు
Add ap7am to your home Screen

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై పాట‌.. సల్మాన్ ఖాన్‌కు మ‌రోసారి బెదిరింపులు

Salman Khan gets Threat again over Song says Mumbai Police
  • పాట ర‌చ‌యిత ఒక నెల‌లోపు తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటారని బెదిరింపులు
  • స‌ల్మాన్‌కు ధైర్యం ఉంటే ర‌క్షించుకోవాల‌ని హెచ్చ‌రిక‌
  • ఆగంతు‌కుల‌పై వ‌ర్లీ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు
బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌కు మ‌రోసారి బెదిరింపులు వ‌చ్చాయి. ఈసారి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును ప్ర‌స్తావిస్తూ వ‌చ్చిన పాట‌పై స‌ల్లూభాయ్‌కి బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు ముంబ‌యి పోలీసులు వెల్ల‌డించారు. గురువారం అర్ధ‌రాత్రి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ముంబ‌యి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి బెదిరించిన‌ట్లు తెలిపారు. 

ఈ పాట ర‌చ‌యిత ఒక నెల‌లోపు తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటారని, స‌ల్మాన్‌కు ధైర్యం ఉంటే ర‌క్షించుకోవాల‌ని హెచ్చ‌రించిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆగంతు‌కుల‌పై వ‌ర్లీ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. 

ఇక ఇటీవ‌ల సల్మాన్ కు త‌ర‌చూ ఇలాంటి బెదిరింపు కాల్స్, సందేశాలు రావ‌డం ప‌రిపాటిగా మారింది. ఈ నేప‌థ్యంలోనే క‌ర్ణాట‌క‌లోని హ‌వేరిలో ఓ వ్య‌క్తిని, రాజ‌స్థాన్‌లో మ‌రో వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం జ‌రిగింది. 

ఇదిలాఉంటే.. ఇదే కోవ‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కి కూడా ఇటీవ‌ల బెదిరింపులు వ‌చ్చాయి. రూ. 50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని, లేనిప‌క్షంలో తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ముంబ‌యి పోలీసుల‌కు గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు.. ఆ ఫోన్‌కాల్‌పై ఆరా తీశారు. దాంతో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ్‌పూర్‌కి చెందిన ఫైజ‌న్ ఖాన్ అనే వ్య‌క్తి పేరు మీద ఆ మొబైల్ నంబ‌ర్ రిజిస్ట‌ర్ అయిన‌ట్లు గుర్తించారు.
Advertisement
Salman Khan
Threat
Mumbai Police
Lawrance Bishnoi Gang Song
Bollywood

More Telugu News