హీరో సందీప్ కిష‌న్ ఉదార‌త‌.. రోజూ 350 మందికి ఉచితంగా భోజ‌నం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో సందీప్ కిష‌న్ ఉదార‌త‌.. రోజూ 350 మందికి ఉచితంగా భోజ‌నం!

Sundeep Kishan Free Food Donation
  • సందీప్ కిష‌న్‌కు వివాహ భోజ‌నంబు అనే రెస్టారెంట్ చైన్‌
  • వివిధ ప్రాంతాల‌లో 7 రెస్టారెంట్‌లు న‌డుపుతున్న హీరో
  • ప్ర‌తి బ్రాంచీ నుంచి రోజూ ఉచితంగా 50 మందికి భోజ‌నం
  • ఇలా త‌న 7 రెస్టారెంట్స్‌ నుంచి ప్ర‌తిరోజు 350 మందికి ఫ్రీగా ఫుడ్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ ఉదార‌త చాటుతున్నారు. ఈ హీరో వివాహ భోజ‌నంబు అనే రెస్టారెంట్ చైన్‌ను న‌డిపిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల‌లో 7 రెస్టారెంట్‌లు ర‌న్ అవుతున్నాయి. అయితే, ప్ర‌తి బ్రాంచీ నుంచి రోజూ ఉచితంగా 50 మందికి భోజ‌నం పంపిస్తున్నారు. 

ఆక‌లితో ఉన్న‌వారికి ఇలా త‌న ఏడు రెస్టారెంట్స్‌ నుంచి ప్ర‌తిరోజు 350 మందికి ఫ్రీగా ఫుడ్ పెట్ట‌డం జ‌రుగుతుంది. తాజాగా సందీప్ కిష‌న్ ఈ విష‌య‌మై 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక పోస్టు పెట్టారు. త‌న టీమ్ పేద‌ల‌కు భోజ‌నం పంచుతున్న ఫొటోల‌ను ఈ పోస్ట్ ద్వారా హీరో పంచుకున్నారు. 

"వివాహ భోజ‌నంబు టీమ్ చేస్తున్న ప‌నికి నేను గ‌ర్వ‌ప‌డుతున్నాను. మీలో ఎవ‌రైనా భోజ‌నం కోసం క‌ష్ట‌ప‌డితే మీ స‌మీపంలోని వివాహ భోజ‌నంబు రెస్టారెంట్‌కి నేరుగా వెళ్లి ఫుడ్ ప్యాకెట్‌ను ఉచితంగా తీసుకోండి" అని సందీప్ కిష‌న్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైర‌ల్ కాగా, నెటిజ‌న్లు ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 
Advertisement
Sundeep Kishan
Free Food
Donation
Tollywood

More Telugu News