హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం
Advertisement

హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం

Rains in Hyderabad and some parts of Telangana
  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
  • ఈరోజే సద్దుల బతుకమ్మ
  • పలు ప్రాంతాల్లో వర్షంలోనే బతుకమ్మ ఆడిన మహిళలు
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లో వర్షం కురుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కాసేపటికే ఆకాశం మేఘావృతమై నగరంలో వర్షం కురిసింది. కోఠి, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కీసర, ఘట్‌కేసర్, నాంపల్లి, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

ఈరోజు సద్దుల బతుకమ్మ కావడంతో ఆడపడుచులు అందరూ బతుకమ్మ ఆడుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం వర్షం కురిసింది. ఆడపడుచులు వర్షంలోనూ బతుకమ్మ ఆడారు. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
Advertisement
Rains
Hyderabad
Telangana

More Telugu News