బెజ‌వాడ దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్‌

Deputy CM Pawan Kalyan Visits Indrakeeladri
  • కూతురు ఆద్య‌తో క‌లిసి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న జ‌న‌సేనాని
  • ఆయ‌న‌తో పాటు దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న‌ మంత్రి అనిత‌, ఎంపీ కేశినేని శివ‌నాథ్ 
  • నేడు మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో స‌రస్వ‌తీదేవీ అలంకారంలో అమ్మవారు 
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు కుమార్తె ఆద్య‌తో క‌లిసి బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. ఆలయం వద్ద పవన్‌కు స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ త‌ర్వాత తీర్థ‌ప్ర‌సాదాలు, అమ్మ‌వారి చిత్రప‌టం అంద‌జేశారు. 

ఉప ముఖ్య‌మంత్రితో పాటు హోంమంత్రి అనిత‌, ఎంపీ కేశినేని శివ‌నాథ్ కూడా దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. ఇవాళ మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో స‌రస్వ‌తీదేవీ అలంకారంలో అమ్మవారు భక్తులకు ద‌ర్శ‌న‌మిస్తున్నారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. 
Advertisement
Pawan Kalyan
Indrakeeladri
Vijayawada
Andhra Pradesh

More Telugu News